Agripedia

తెలంగాణకు కేంద్రం ప్రభుత్వం శుభవార్త .. బాయిల్డ్ రైస్ కొనుగోళ్లపై కీలక ప్రకటన..

Srikanth B
Srikanth B

తెలంగాణకు కేంద్రప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కొద్ది నెలలుగా బాయిల్డ్ రైస్ కొనుగోళ్లపై కేంద్రప్రభుత్వానికి, రాష్ట్రప్రభుత్వానికి మధ్య వివాదం నడుస్తోంది.

ఈ నేపథ్యంలో బియ్యం కొనుగోలుకు సంబంధించి కీలక ప్రకటన చేశారు. రబీ 2021-22 సీజన్ కోసం, ఫుడ్ కార్పొరేషన్ ఇండియా-ఎఫ్‌సిఐ తెలంగాణ నుండి 8 లక్షల టన్నుల బియ్యాన్ని సేకరించేందుకు అంగీకరించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ మంత్రిత్వ శాఖ లేఖ రాసింది.

కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. రైతు సంక్షేమం, అన్నదాత సమస్యల పరిష్కారం దిశగా తమ ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసిందని కిషన్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే తెలంగాణ 6.05 లోల మెట్రిక్ టన్నుల ఉప్పుడు బియ్యాన్ని కేంద్రప్రభుత్వం సేకరిస్తుండగా.. దీనికి అదనంగా మరో 8లోల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సేకరించేందుకు ముందుకొచ్చిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు.

భారతదేశ 14వ ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధంఖర్ నేడు ప్రమాణ స్వీకారం చేశారు

భారత ఆహార సంస్థ -FCI వద్ద మూడేళ్లకు సరిపడా ఉప్పుడు బియ్యం నిల్వలు ఉన్నప్పటికి తెలంగాణ రైతులు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతోనే కేంద్రం ఈనిర్ణయం తీసుకుందన్నారు. రైతుల పట్ల సానుకూల ధృక్పదంతో తెలంగాణలో బాయిల్డ్ రైస్ సేకరణకు కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసకున్నందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ శాఖ మంత్రి పియూష్ గోయల్ కు కిషన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.

పాడి రైతులకు పెద్ద ఊర‌ట, లంపీ చ‌ర్మ‌వ్యాధికి దేశీయ వాక్సిన్‌ను ఆవిష్క‌రించిన కేంద్ర వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రి శ్రీ తోమ‌ర్‌

Share your comments

Subscribe Magazine