ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ 2023 సీజన్‌కు ఎండు కొబ్బరి కనీస మద్దతు ధరలను నిర్దారిస్తూ (MSP ) ఆమోదించింది. గతం లో ఎండు కొబ్బరి పై ఏర్పాటు చేసిన కమిషన్ సూచనలు , కొబ్బరిని పండించే రాష్ట్రాల సలహాల మేరకు కేంద్ర క్యాబినెట్ ఎండుకొబ్బరి కి మద్దతు ధరను ప్రకటించింది . దీనితో కొబ్బరి రైతులకు మరింత లాభం చేకూరనుంది .
2023 సంవత్సరరానికి ఎండు కొబ్బరి ధర కనిష్టముగా MSP (కనీస మద్దతు ధర) క్వింటాల్‌కు రూ.10,860/- నుంచి అందులో ఉన్న వెరైటీ ఆధారముగా గరిష్టముగా 11,750/- ను ఎండు కొబ్బరి MSP కు కేంద్ర ప్రభుతవ కాబినెట్ ఆమోదం లభించింది . దీనితో మిల్లింగ్ చేసే వారికీ 51 శాతం మర్గిన్ మరియు రైతులకు 64. 26 శాతం మార్జిన్ లభించనున్నట్లు కేంద్రం తెలిపింది .
కొబ్బరి రైతులకు మెరుగైన రాబడిని అందించి వారి యొక్క జీవన ప్రమాణాలను మెరుగు పరచడంలో MSP అందించడం కీలకమైన పరిణామం అని కేంద్రం తెలిపింది .
నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NAFED) మరియు నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ (NCCF) ధర మద్దతు పథకం క్రింద కొప్రా మరియు ఎండు కొబ్బరి సేకరణ కోసం సెంట్రల్ నోడల్ ఏజెన్సీలుగా (CNF) కొనసాగుతాయి.
భారతదేశం లో టాప్ 5 ధనిక రైతులు వీరే .. కోట్లలో సంపాదన !
NAFED-నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్:
నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్.(NAFED) 2వ అక్టోబర్ 1958న గాంధీ జయంతి రోజున స్థాపించబడింది. నాఫెడ్ మల్టీ స్టేట్ కో-ఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ కింద రిజిస్టర్ చేయబడింది. రైతులకు మేలు జరిగేలా వ్యవసాయ ఉత్పత్తుల సహకార మార్కెటింగ్‌ను ప్రోత్సహించాలనే లక్ష్యంతో నాఫెడ్‌ను ఏర్పాటు చేశారు.
NCCF-నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్:
ఎన్‌సిసిఎఫ్, దేశంలో వినియోగదారుల సహకార ఉద్యమాన్ని ప్రోత్సహించే సంస్థగా, మొత్తం ఆర్థిక మెరుగుదల మరియు ఆర్థిక స్వయంప్రతిపత్తి సహకార సంఘాల స్వచ్ఛంద ఏర్పాటు మరియు ప్రజాస్వామ్య పనితీరును సులభతరం చేయాలని కోరుకుంటుంది.
PSS- మద్దతు ధర పథకం:
వ్యవసాయ ఉత్పత్తులకు ప్రభుత్వ విధానాల ద్వారా మద్దతు ధర అందించడానికి సహాయపడుతుంది .
Share your comments