Agripedia

సోరకాయని పండించే మెలకువలు తెలుసుకోండి:

Srikanth B
Srikanth B

మనం ఇష్టంగా తినే కూరగాయల్లో సొరకాయ ఒకటి ఇందులో నీటి శాతం అధికంగా ఉంటుంది. పందిరి సహాయంతో ఇది పెరుగుతుంది. వ్యవసాయ క్షేత్రంలోనే కాకుండా కాకుండా ఇంటి పెరట్లో కూడా కూడా సులభంగా పండించవచ్చుకోవచ్చు. సొరకాయ లో అధిక దిగుబడులు సాధించడానికి కావాల్సిన మెళకువలు తెలుసుకుందాం.

అనువైన నేలలు:
మంచి నీటి పారుదల ఉండి సేంద్రియ కర్బన పదార్థం అధికంగా ఉండే ఇసుక లోమీ నేలలు,ఎర్ర నేలలు,బంకమట్టి నేలల్లో దిగుబడి అధికంగా ఉంటుంది. పొలం లో మురుగు నీటిని సులువుగా ప్రాలదోలే చర్యలు చేపట్టాలి. ఉదజని సూచిక (pH) 6.5 నుండి 7.5 వరకు వున్నవి అనువైనవి

వాతావరణం:
సోరకాయ సాగుకి మితమైన వెచ్చని ఉష్ణోగ్రత అవసరం. 26 నుండి 28 డిగ్రీల సెల్సియస్ దగ్గర మంచి దిగుబడి ఉంటుంది. వాతావరణంలో తేమ శాతం కూడా ఉండాలి.

అధిక దిగుబనిచే రకాలు:
పూసా సమ్మర్ ప్రోలిఫిక్ రౌండ్,కో 1, పూసా మంజరి , పూస మేఘదూత్ వంటి రకాలు అధిక దిగుబడులను ఇస్తాయి.

విత్తన మోతాదు: ఒక ఎకరానికి 1నుండి 1.5 కిలోల విత్తనాలు సరిపోతాయి.

విత్తన శుద్ధి:
విత్తడానికి ముందు ట్రైకోడెర్మా విరిడే 4 గ్రాములు లేదా సూడోమోనాస్ ఫ్లోరోసెన్స్ 10 గ్రాములు లేదా కార్బెండజిమ్ 2 గ్రాములు ఒక కిలో విత్తనాలతో కలిపి శుద్ధి చేసుకోవాలి తద్వారా విత్తనాలు ద్వారా వ్యాపించే వ్యాధులను అరికట్టవచ్చు ఇంకా మొలకెత్తడంలో అడ్డంకులు తొలగిపోతాయి.

నీటి పారుదల:
విత్తనాలు వేయక ముందు నీటిని పారించి తగిన తేమ ఉండేట్లు చూసుకోవాలి. సొరకాయకి పూత మరియు పిందె కాసే సమయం చాలా సున్నితమైంది కాబట్టి ఈ సమయంలో నీటి పారుదల సమృద్ధిగా ఉండేట్లు చూసుకోవాలి.

ఎరువుల యాజమాన్యం:
సేంద్రీయ ఎరువులను వాడటానికి ప్రాముఖ్యం ఇవ్వాలి. ఒక ఎకరా సోరకాయ సాగుకి సుమారుగా 40 కిలోల నత్రజని ,30కిలోల భాస్వరం మరియు 25కిలోల పోటాష్ ఎరువులు అవసరమవుతాయి. నత్రజని ఎరువును మొత్తం ఒకే సారి వేయకుండా రెండు భాగాలుగా విభజించి వేసుకోవాలి. మొదటి మోతాదుని విత్తిన తర్వాత 3 నుండి 4 వారాల మధ్య వేసుకోవాలి. రెండో మోతాదుని పిందె దశలో ఉన్నప్పుడు వేసుకుంటే ఫలితాలు బాగుంటాయి.

కలుపు మొక్కల నివారణ:
కలుపు మొక్కలను నివారణకై బ్యుటాక్లొర్ లేదా అల్లాక్లొర్ ని నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి , మొక్కల మధ్య మళ్చింగ్ వేసి కూడా కలుపు రాకుండా నియంత్రించవచ్చు దీనికై ఎండు గడ్డిని,ఆకులను లేదా ప్లాస్టిక్ షీట్ ని ఉపయోగించవచ్చు.

వీటిని క్రమ పద్దతిగా ఆచరించినట్లయితే సొరకాయ సాగులో ఉత్తమమైన దిగుబడులను పొందవచ్చు .

మరిన్ని చదవండి

పంట వ్యర్థాలను దహించకుండా ఫలవంతగా వాడుకుందాం ఇలా

మామిడి పిందెలు రాలకుండా నిర్మూలన చర్యలు

 

Share your comments

Subscribe Magazine