బ్లాక్ రైస్ లో రోగనిరోధక శక్తిని పెంపొందించే యాంటీ ఆక్సిడెంట్లతో పాటు ఐరన్, జింక్ వంటి సూక్ష్మపోషకాలు అధికంగా ఉండటం వలన నేటి ప్రపంచంలో బ్లాక్ రైస్ కి విపరీతంగా డిమాండ్ ఉంది.
పోషకాలకు మూలం:
ఇతర రకాల బియ్యంతో పోలిస్తే , బ్లాక్ రైస్ లో ప్రోటీన్ అత్యధికంగా ఉంటుంది. ఐరన్ కూడా బ్లాక్ రైస్ లో అధికంగా ఉంటుంది.కేలరీలు మరియు పిండి పదార్థాలు కూడా పుష్కలంగా ఉంటాయి.
క్యాన్సర్ నిరోధక లక్షణాలు:
బ్లాక్ రైస్ లో ఉండే ఆంథోసైనిన్‌లు శక్తివంతమైన యాంటీకాన్సర్ లక్షణాలను కలిగి ఉంటాయి.వీటిని తీసుకోవడం వలన కాన్సర్ ను జయించే నిరోధక శక్తిని పెంచుకోవచ్చు.
కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది:
బ్లాక్ రైస్‌లో అధిక మొత్తంలో లుటిన్ మరియు జియాక్సంతిన్‌లు ఉన్నాయని పరిశోధనలు చెబుతున్నాయి - కంటి ఆరోగ్యానికి సంబంధించిన రెండు రకాల కెరోటినాయిడ్లు. కళ్లకు హాని కలిగించే ఫ్రీ రాడికల్స్ నుండి రక్షించడంలో సహాయపడతాయి. ముఖ్యంగా, హానికరమైన నీలి కాంతి తరంగాలను ఫిల్టర్ చేయడం ద్వారా రెటీనాను రక్షించడంలో లుటీన్ మరియు జియాక్సంతిన్ సహాయపడతాయని పరిశోధనలో తేలింది.
యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి:
ఇతర వరి రకాల కంటే తక్కువ ప్రజాదరణ పొందినప్పటికీ, బ్లాక్ రైస్ అత్యధిక యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉందని పరిశోధనలు చెబుతున్నాయి.బ్లాక్ రైస్‌లో సుమారుగా 23 రకాల యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి.గుండె జబ్బులు, అల్జీమర్స్ వంటి వ్యాధులతో బాధపడుతున్న వారు వీటిని తరుచుగా ఆహారంగా తీసుకుంటే వీటి బారి నుండి ఉపశమనం పొందే వకాశాలు ఉన్నాయి.
అంతే కాకుండా రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారిలో బ్లాక్ రైస్ ని తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేస్తుంది.
ఆచార్య ఎన్ జి రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం కింద ఉన్న బాపట్ల వ్యవసాయ కళాశాలలో వ్యవసాయ శాస్త్రవేత్తలు గతంలోనే బ్లాక్ రైస్ వంగడాలను అభివృద్ధి చేసారు.వీటిలో ముఖ్యమైనది BPT 2841 రకం, ఈ రకం పంట ఈదురు గాలులకు పడిపోకుండా ఉండటం , చీడపీడలను తట్టుకోవటం, ఎకరానికి 30–35 బస్తాల దిగుబడినివ్వటం వంటి ప్రత్యేకలను కలిగి ఉంది.దీని పంట కాలం 130–140 రోజులు. ఈ రకం దాదాపు 110 సెం.మీ. ఎత్తు పెరుగుతుంది. దోమపోటు, అగ్గి తెగుళ్లను కొంత వరకు తట్టుకుంటుంది.
మరిన్ని చదవండి.
Share your comments