Agripedia

తమలపాకు సాగులో వచ్చే వివిధ రకాల తెగుళ్లు-నివారణ చర్యలు!

KJ Staff
KJ Staff

దేశంలో ఎక్కడైనా, ఎప్పుడైనా ఏ శుభకార్యం జరిగినా తమలపాకులు తప్పకుండా ఉండాల్సేందే. పెండ్లిళ్లు, పేరంటాల్లోనూ తమలపాకు తాంబూలను వచ్చిన అతిథులకు అందించాల్సిందే. కేవలం ఆయా సందర్భాల్లోనే కాకుండా తమలపాకులను పాన్ లలో ఎక్కువ మొత్తంలో ఉపయోగిస్తున్నారు. దీనికి తోడు వివిధ రకాల ఆయుర్వేద మందుల తయారీలోనూ వీటిని ఉపయోగిస్తారు. అందువల్ల వీటికి మార్కెట్ లో అధిక డిమాండ్ ఉంటుంది. అయితే, తమలపాకు సాగు చేసే రైతులు ఎదర్కొనే ప్రధాన సమస్యల్లో ఈ పంటను అధికంగా చీడపీడలు ఆశించడం ఒకటి. దీని కారణంగా అనేక రకాలు తెగుళ్లు వస్తాయి. రైతులకు మంచి ఆదాయాలు రాకపోగా ఒక్కోసారి తీవ్ర నష్టాలకూపిలోకి జారుకునే అవకాశమూ లేకపోలేదని వ్యవసాయ నిపుణులు, పరిశోధకులు చెబుతున్నారు. సాధారణంగా తమలపాకు సాగులో వచ్చే వివిధ రకాల తెగుళ్ల, వాటి నివారణకు సంబంధించిన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

తమలపాకు సాగులో సాధారణంగా వచ్చే తెగుళ్లలో తమలపాకు ఎండుతెగులు మొదలు కుళ్ళు తెగుళ్లు ప్రధానమైనవి ఈ తెగులు కారణంగా మొక్క తీగలు రంగు మారి నల్లగా మారి చనిపోతాయి. ఆకుల మీద కూడా గోధుమ రంగు మచ్చలు ఏర్పడగాయి. దీనిని మొదట్లోనే గుర్తించి సంబంధించిన మొక్కల భాగాలను తొలగించాలి. అవసరమైనే మొక్కనే పంటను నుంచి తొలగిస్తే.. ఇతర మొక్కలకు సోకకుండా ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న మందులను వాడుకోవాలి. తమలపాకులో వచ్చే తెగుళ్లలో అగ్గితెగులు కూడా ఒకటి. రసంపీల్చు పురుగుల కారణంగా ఆకులపై మచ్చలు ఏర్పడతాయి. ఇవి కాల్చినట్టుగా ఉంటాయి. దీని నివారణ కోసం కార్బరిల్ మందును పంటపై పిచికారి చేసుకోవాలి. 

తమలపాకులో బ్యాక్టిరియా ఆకుమచ్చ తెగులు కూడా అధికంగా వస్తుంటుంది. దీని కారణంగా ఆకుల ఆడుగుభాగంలో మచ్చలు ఏర్పడి.. తర్వాత ఆకులను కుళ్లిపోవడానికి దారి తీస్తాయి. తీగలు, కాండం సైతం పగుళ్లు ఏర్పడతాయి. తమలపాకు బ్యాక్టిరియా తెగులు నివారణకు కాపర్ ఆక్సీక్లోరైడ్ ను లీటరు నీటికి మూడు గ్రాములు కలుపుకుని పిచికారీ చేసుకోవాలి. బర్మా పురుగులు సైతం తమలపాకు సాగును ఆశిస్తాయి. ఇవి కాండంలోపలి భాగాన్ని కొరికివేస్తాయి. పొగాకు లద్దె పురుగులు సైతం తమలపాకు పంటను ఆశిస్తాయి. వీటి ప్రభావం పంటపై ఉండకుండా వేపనూనే సహా సేంద్రీయ మందులను పిచికారీ చేసుకోవాలి.

Share your comments

Subscribe Magazine