వ్యవసాయ రంగంలో వచ్చిన విప్లవాత్మక మైన మార్పుల్లో (మైక్రో ఇరిగేషన్ సిస్టం) సూక్ష్మ సాగునీటి పద్ధతి లేదా బిందు సేద్య పద్ధతికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. బిందు సేద్య పద్ధతికి అనువైన ఫర్టిగేషన్ విధానంలో మొక్కలకు అవసరమైన సాగునీరు,సూక్ష్మ, స్థూల పోషక ఎరువులు అన్ని మొక్కలకు సమానంగా ఒకేసారి అందించబడతాయి.ఈ విధానంలో మొక్కలు ఎరువులను సమర్థవంతంగా వినియోగించుకొని అధిక నాణ్యమైన దిగుబడులు సాధించడమే కాకుండా పర్యావరణ సమతుల్యంపై ఎటువంటి చెడు ప్రభావంఉండదు.
ఫర్టిగేషన్ విధానంలో కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. కూలీల కొరత అధికంగా ఉన్న రోజుల్లో తక్కువ శ్రమతో మొక్కలకు నీటిని, నీటిలో కరిగే ఎరువులను అందించే వెసులుబాటు ఉండడంతో చాలామంది రైతులు బిందు సేద్యం లో ఫర్టిగేషన్ విధానాన్ని అనుసరించడానికి ఆసక్తి చూపిస్తున్నారు.ఫర్టిగేషన్ పద్ధతి వల్ల పంట దిగుబడులు దాదాపు 40 నుండి 70 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది.
సాధారణంగా ఎరువులను వెదజల్లడం గానీ, మొక్కల మొదళ్ళలో వేయడం వంటి సాంప్రదాయ పద్ధతిలో ఎరువుల వినియోగం చాలా తక్కువగా ఉంటుంది. ఈ విధానం కొంత శ్రమతో కూడుకున్నదిగా చెప్పవచ్చు. అయితే
ఫర్టిగేషన్ విధానంలో మొక్కలకు అవసరమైన పోషకాలు ఖచ్చితత్వంతో మొక్క వేరు వ్యవస్థకు సూటిగా అందించడం వల్ల ఎరువుల వృధాను అరికట్టే నాణ్యమైన దిగుబడిని పొందవచ్చు. అలాగే కలుపు మొక్కల సమస్య కూడా చాలా తగ్గుతుంది. ముఖ్యంగా ఎగుడుదిగుడు పొలాల్లో నీరు ఇంకని ఇతర సమస్యాత్మక భూములకు ఫర్టిగేషన్ విధానం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.
Share your comments