పశువులు, ఇతర మూగజీవాలు ఉన్న రైతులు వాటికి అందించే ఆహారానికి సంబంధించి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వాటికి సరిపడంతా మేత అందిస్తే వాటి పెరుగుదల మంచిగా ఉండి రైతులకు ఆదాయాన్ని అందిస్తాయి. అదే పాడి పశులు అయితే, పచ్చిమేత అధికంగా అందిస్తే పాలు దిగుబడి కూడా పెరుగుతుంది. కాబట్టి పశుగ్రాస పంటలను సాగు విషయంలో రైతులు సరైన ఎంపికలు చేసుకోవాలి. పశువులకు మేతలో అధిక పోషకాలు ఉండే వాటిని సాగు చేసుకోవాలి. వాటిలో ముఖ్యమైనవి పప్పుజాతి రకాలు, ధాన్యాపు జాతి రకాలు, పుష్కలమైన పోషకాలు కలిగిన గడ్డి జాతి రకాలు ఉన్నాయి.
పశుగ్రాస పంటలు చాలానే ఉన్నాయి. సంవత్సరంలో ఒకే సారి కొతకు వచ్చే ఏకవార్షకాలు, ఏడాదిలో ఎనిమిది నుంచి పది కోతలకు వచ్చే బహువార్షిక రకాలు ఉన్నాయి. వీటిలో మనకు అనుకూలంగా ఉన్న రకాలు ఎంచుకుని సాగు చేయాలి. ఏకవార్షిక రకాల కంటే బహువార్షిక రకాలు సాగు చేయడం వల్ల సంవత్సరం పొడవునా పశువులకు పచ్చిమేత దొరుకుతుంది. ఏకవార్షికాలతో పశువులకు, బలమైన, పుష్కలంగా పోషకాలు ఉండే ఆహారం లభిస్తుంది. వాటిలో సజ్జ, మొక్కజొన్న, జొన్న, ఓట్స్, బర్సిం, జనుము, పిల్లిపెసర, అలసందలు వంటి రకాలు ఉన్నాయి. బహువార్షికాల్లో అనేక హైబ్రీడ్ రకాలకు చెందిన గడ్డిజాతి పశుగ్రాస పంటలు ఉన్నాయి. వాటిలో ఆదరణ పొందినవాటిలో హైబ్రిడ్ నేపియర్, పారా గడ్డి, గినీ గడ్డి, లూసర్న్ గడ్డిలు ఉన్నాయి.
ఏకవార్షిక పశుగ్రాస పంటలు సాగు చేయడానికి అన్ని రకాల నేలలు అనుకూలంగా ఉంటాయి. నీటి ఎద్దడి ఉన్న తట్టుకుంటాయి. అదే బహువార్షిక పశుగ్రాస పంటల సాగుకు నీటి పుష్కలంగా ఉండాలి. సారవంతమైన భూములతో పాటు ఒండ్రు నేలలు, మధ్య రకం భూములు సైతం ఈరకం పంటల సాగుకు అనుకూలంగా ఉంటాయి. ఆయా రకాలను బట్టి వాటిని నాటుకోవాల్సి ఉంటుంది. ఏకవార్షికాలైతే సాధారణంగా చిన్న చిన్న మడులుగా చేసుకుని సిద్ధం చేసుకున్న పొలంలో విత్తనాలు జల్లుకోవాలి. అదే బహువార్షికాలతై పోలాన్ని బోదేలుగా చేసుకుని మొక్కలను నాటుకోవాలి. వాటి మధ్య దూరం ఆయా రకాలను బట్టి మారుతుంది. సాధారణంగా పొలం సిద్ధం చేసుకునే సమయంలో పశువుల ఏరువులు వేసుకుంటే సరిపోతుంది. అదే బహువార్షిక పశుగ్రాస పంటకు కొత అయిపోయిన తర్వాత యూరియా, నత్రజని ఎరువులను సాధారణ మోతాదులో వేసుకోవాలి.
Share your comments