మండుస్ తూఫాను కారణముగా నష్ట పోయిన ఆంధ్రప్రదేశ్ రైతులకు తక్షణ సహకారంగా ఆంద్రప్రదేశ్ పొగాకు బోర్డు రైతులకు 10,000 వేల వరకు వడ్డీ లేని ఋణం మంజూరు చేస్తూ తీసుకున్న నిర్ణయానికి ఆమోద ముద్ర పడింది. దీనిక్రింద మొత్తం 28,112 మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది . 28,112 మంది మంది పొగాకు రైతులకు 10,000 చొప్పున అందించడానికి అవసరమైన రూ.28.11 కోట్లు నిధులకు కేంద్ర వాణిజ్య-పరిశ్రమలు; వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం-ప్రజాపంపిణీ, జౌళి శాఖల మంత్రి శ్రీ పీయూష్ గోయల్ ఆమోదించారు.
మాండౌస్ తుఫాను కారణముగా నష్టపోయిన రైతులు తొందరగా కోలుకోవడానికి ఇది దోహదం చేస్తుందని మంత్రి శ్రీ పీయూష్ తెలిపారు .
ఆంధ్రప్రదేశ్‌లోని 10 జిల్లాల్లో 66,000 హెక్టార్ల విస్తీర్ణంలో 121 మిలియన్ కిలోల (2021-22) వార్షిక ఉత్పత్తితో ప్రధాన వాణిజ్య పంటగా ‘ఎఫ్‌సివి' పొగాకును సాగుచేస్తారు. భారతదేశం నుంచి ఎగుమతి చేసే ముడి పొగాకులో ఈ ‘ఎఫ్‌సివి' రకం ప్రధానమైనది. ఈ మేరకు మొత్తం ముడి పొగాకు ఎగుమతులలో (తిరస్కరణకు గురైనది మినహా) ‘ఎఫ్‌సివి' రకం 2021-22లో పరిమాణం పరంగా 53.62 శాతం కాగా, విలువ పరంగా 68.47 శాతంగా నమోదైంది.
ఎండు కొబ్బరికి MSP మద్దతు ధరకు కేంద్రం ఆమోదం !
ఈ రకం పొగాకు సాగుచేసే రైతులు తమ ఉత్పత్తులను పొగాకు బోర్డు ఏర్పాటు చేసి, నిర్వహిస్తున్న ఇ-వేలం వేదికద్వారా పారదర్శక రీతిలో విక్రయిస్తూ న్యాయమైన, లాభదాయక ధరను పొందుతారు. ఈ నేపథ్యంలో కేంద్ర వాణిజ్య-పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని చట్టబద్ధ సంస్థ ‘పొగాకు బోర్డు’ అర్హులైన ‘ఎఫ్‌సివి' పొగాకు రైతులకు వడ్డీ రహిత రుణమంజూరు వ్యవహారాలను నిర్వహిస్తుంది.
Share your comments