మనం తీసుకునే ఆహార పదార్థాల్లో.. ముఖ్యంగా ఆకుకూరలలో శరీరానికి అవసరమైన అనేక రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే మార్కెట్ లో ఆకుకూరలకు సంవత్సరాంతరం కూడా డిమాండ్ ఉంటుంది. దీంతో వీటిని సాగు చేసే రైతులకు మంచి ఆదాయం వస్తుంది. అందుకే చాలా మంది రైతులు వీటిని సాగు చేయడానికి ఎక్కువ మక్కువ చూపిస్తుంటారు. అలాంటి ఆకుకూరల్లో తోటకూర కూడా ఒకటి. తోటకూరను ఎలా సాగు చేయాలి? సాగు యాజమాన్య పద్దతులేంటి? సంబంధిత వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం...
తోటకూరను సాగు చేయడానికి ఇసుకతో కూడిన గరప నేలలు అనుకూలంగా ఉంటాయి. నీటి అవసరం సైతం పరిమితంగానే ఉంటుంది. వర్షకాలంలో జూన్ నుంచి డిసెంబర్ వరకు, వేసవి కాలంలో జనవరి నుంచి మే వరకు తోటకూరను సాగు చేయవచ్చు. అయితే, ప్రస్తుతం మార్కెట్ లో సంవత్సరాంతరం సాగు చేసే తోటకూర విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. తోటకూరను సాగు చేయడానికి ముందు నేలను మూడు నుంచి నాలుగు సార్లు దున్నుకోవాలి. ఆ సమయంలో ఒక ఎకర పొలానికి పది టన్నుల వరకు పశువులు ఎరువులు వేసుకుంటే పంట దిగుబడి అధికంగా ఉంటుంది. నేలను చదునుగా దున్నుకున్న తర్వాత చిన్నచిన్న ముడులుగా చేసుకుని విత్తనాలు విత్తుకోవాలి. దీని వల్ల నీరు పారించడం, కొతకు అనుకూలంగా ఉంటుంది. ఒక ఏకరం పొలినికి దాదాపు 800 గ్రాములు విత్తనం సరిపోతుంది. నారుమడి పోసుకునికూడా నాటుకోవచ్చు. విత్తనం వెదజల్లే పద్ధతిలో అయితే, దాదాపు రెండు కిలోల విత్తనం అవసరం అవుతుంది.
అయితే, వీటిలో కొతతో పాటు వేళ్లతో సహా మొక్కలను పీకే రకాలు ఉన్నాయి. మనకు అనుకూలంగా ఉన్న రకాలను ఎంచుకోవాలి. నేల స్వభావం, తేమను బట్టి నీరును అందించాల్సి ఉంటంది. నీరు సరిపడినంత అందిస్తే.. దిగుబడి మంచిగా వస్తుంది. 25 రోజుల్లో మొదటి కోత రాగా, ఆ తరువాతా వారానికి ఒక కోత కోసుకోవచ్చు. తోటకూరకు ప్రధానంగా తెల్ల మచ్చ తెగులు, ఆకు తినే గొంగళి పురుగు సంబంధిత తెగుళ్లు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించిన సస్యరక్షణ చర్యలు తీసుకోవాలి.
Share your comments