పప్పు దినుసులలో సెనగలు(చిక్ పి ) అతి ముఖ్యమైనది. ప్రతి సంవత్సరం 18.1 మిలియన్ మెట్రిక్ టన్నుల చిక్ పీ , ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి చెయ్యబడుతుంది. ఒక్క ఇండియా లోనే 13. 5 మిలియన్ మెట్రిక్ టన్నుల సెనగ పండించబడుతుంది. టర్కీ, ఆఫ్రికా, ఇండియా,మైన్మార్, పాకిస్తాన్ లాంటి దేశాల్లో చిక్ పియా ని అధికంగా పండించబడుతుంది. కానీ ఈ మధ్య కాలం లో చిక్ పి సాగు లో తగ్గుదల కనబడుతుంది. ఉత్పాదకత తగ్గిపోవడం, పంటను పండించే ప్రాంతాలు క్రమంగా తగ్గిపోవడం వీటికి ముఖ్య కారణాలుగా చెప్పుకోవచ్చు
చిక్ పీ ని ప్రధాన ఆహారంగా స్వీకరించే ప్రజలు దీని మూలాన ఎంతో భాగడపాలవాల్సి ఉంటుంది. దీనికి సమాధానంగా ఇంటర్నేషనల్ క్రాప రీసెర్చ్ ఇంస్టిట్టే ఫర్ సెమి అరిద్ ట్రోపిక్స్ (ఇక్రిశాట్ ) చిక్ పీ ఉత్పత్తి పెంచే దిశగా అడుగులు వేస్తూ ఒక కొత్త ఆలోచన తో ముందుకు వచ్చింది. దానికి పేరు చిక్ పీ స్పీడ్ బ్రీడింగ్ ప్రోటోకాల్ గ నామకరణం చేసింది. మొక్కలలోని సామర్ధ్యాన్ని పెంచి అధిక దిగుబడులు వచ్చేలా బ్రీడింగ్ ప్రాసెసింగ్ టైం ను తగ్గించడమే ఈ ప్రోటోకాల్ యొక్క ముఖ్య ఉద్దేశం.
చిక్ పీ ఎక్కువగా పాక్షిక శుష్క వాతావరణం లో పెరుగుతుంది. ఖరీఫ్ మరియు రబి రెండు చిక్ పీ పంటకు అనుకులిస్తాయి. ఇంటెర్నేషన్ క్రాప రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సెమి అరిద్ ట్రోపిక్స్ (ఇక్రిశాట్ )అనే సమస్త చిక్ పీ ఫై అనేకరకములైన పరిశోధనలు జరుపుతుంది. గత 10 సంవత్సరాలలో ఇక్రిశాట్ 23 వెరైటీస్ ఐసిఏఆర్ సహకారంతో విడుదల చేసింది. సాధారణంగా ఒక్క కొత్త వెరైటీ మొక్క విడుదల చెయ్యడానికి 10 నుండి 15 సంవత్సరాల సమయం పడుతుంది. ఇక్రిశాట్ ఈ సమయాన్ని తగ్గించి తక్కువ కాలంలో కొత్త రకాలను అందిక్కునే దిశగా అడుగులు వేస్తుంది.
ఇక్రిశాట్ ప్రవేశపెట్టినా ఈ స్పీడ్ బ్రీడింగ్ ప్రోటోకాల్ ద్వారా, సాధారణంగా 10 ఏళ్ళు పట్ బ్రీడింగ్ సైకిల్ ను కేవలం రెండు- మూడు ఏళ్లకు కుదించవచ్చు. లైట్ ని, వాతావరణం లోని తేమను, వేడిని, మనకు కావల్సిన విధంగా నియత్రించడం ద్వారా మొక్క ఎదుగుదలను మనకు కావాల్సిన విధంగా మార్చవచ్చు.
ఆహార భద్రత మరియు మట్టి ఆరోగ్యం ఫై చిక్ పీ ప్రభావ:
చిక్ పీ ఎక్కువగా పండించే దేశాలు ఐన ఇండియా, మయన్మార్, టాంజానియా, కెన్యా వంటి దేశాల్లో ఆహార భద్రతను కాపాడడం లోను అలాగే మట్టిలోని పోషకవిలువలు పెంపొందిచడంలోనూ చిక్ పీ అపారమైన ప్రాముఖ్యత ఉంది. లెగ్వఉమినాసీ జాతికి చెందిన మొక్క కావడం తో వాతావరణం లోని నైట్రోజన్ మట్టిలో కలిసేలా చేస్తుంది. తక్కువ వెలుగు ఆసిస్తూ ఎక్కువ కాల చక్రం కలిగిఉన్న మొక్కు కాబ్బటి, సాంప్రదాయబద్దమైన పద్ధతులు ద్వారా బ్రీడింగ్ అధిక సమయం తీసుకుంటుంది. కనుక ఇక్రిశాట్ రూపొందించి బ్రీడింగ్ ప్రోటోకాల్ విధానాన్ని పాటించడం తక్కువ కాలంలోనే అభివృద్ధి చెందిన మొక్క రకాలు అందించే అవకాశం ఉంటుంది అని ఇక్రిశాట్ డైరెక్టర్ డా. జక్క్యూలిన్ హుఘ్స్ తెలిపారు.
Share your comments