Agripedia

ఔష‌ధ మొక్క‌ల పెంప‌కాన్ని ప్రోత్స‌హించేందుకు కేంద్రం తీసుకున్న చ‌ర్య‌లు.. !

Srikanth B
Srikanth B
Actions taken by the center to promote the cultivation of medicinal plants- 2022
Actions taken by the center to promote the cultivation of medicinal plants- 2022

భార‌త‌దేశంలో ఔష‌ధ మొక్క‌లు: వాటి డిమాండు, స‌ర‌ఫ‌రాపై అంచ‌నా, వేద్‌, గొరియా అనే అధ్య‌య‌నం (2017) ప్ర‌కారం ఇండియ‌న్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేష‌న్ ( భార‌తీయ అడ‌వుల ప‌రిశోధ‌న విద్య కౌన్సిల్ (ICFRE ) ,నేష‌న‌ల్ మెడిసిన‌ల్ ప్లాంట్స్ బోర్డ్ (NMPB ) స‌హ‌కారంతో 2014-15 లో దేశంలో మూలిక‌లు / ఔష‌ధ మొక్క‌ల డిమాండు 5,12,000 మెట్రిక్ ట‌న్నులుగా ఉన్న‌ట్టు అంచ‌నా వేసింది.

 

అధ్య‌య‌నం ప్ర‌కారం సుమారు 1178 జాతుల ఔష‌ధ మొక్క‌లను వాణిజ్యంలో వాడుతున్న‌ట్టు న‌మోదు కాగా, అందులో 242 జాతులును ఏడాదికి 100 మెట్రిక్ ట‌న్నుల‌కు పైగా అత్య‌ధిక ప‌రిమాణంలో వాణిజ్యం జ‌రిగింది. ఈ 242 జాతుల లోతైన విశ్లేష‌ణ‌లో 173 జాతులను (72%) అడ‌వుల నుంచి సేక‌రించ‌డం జ‌రిగింది.


దేశ‌వ్యాప్తంగా ఔష‌ధ మొక్క‌ల సాగును ప్రోత్స‌హించేందుకు ప్ర‌భుత్వ ఆయుష్ మంత్రిత్వ శాఖ కేంద్ర ప్రాయోజిత కార్య‌క్ర‌మం అయిన జాతీయ ఆయుష్ మిష‌న్ (NAM ) 2015-16 నుంచి 2020-21 వ‌ర‌కు అమ‌లు చేసింది. జాతీయ ఆయుష్ మిష‌న్ (NAM ) ప‌థ‌కం కింద ఔష‌ధ మొక్క‌ల విభాగంలో దిగువ‌న పేర్కొన్న అంశాల‌కు మ‌ద్ద‌తునందించ‌డం జ‌రిగింది.

  • రైతుల పొలాల్లో ప్రాధాన్య‌త ఇచ్చిన ఔష‌ధ మొక్క‌ల పెంప‌కం
  • నాణ్య‌మైన మొక్క‌ల‌ను నాటేందుకు వెనుక అనుసంధానాల‌తో న‌ర్స‌రీల ఏర్పాటు
  • ఫార్వార్డ్ లింకేజెస్ ( భ‌విష్య‌త్ అనుసంధానాల‌తో) పంట అనంత‌ర నిర్వ‌హ‌ణ‌
  • ప్రాథ‌మిక ప్ర‌క్రియ‌లు, మార్కెటింగ్ మౌలిక స‌దుపాయాలు, త‌దిత‌రాలు.

నేటివ‌ర‌కు, ఆయుష్ మంత్రిత్వ శాఖ 2015-16 నుంచి 2020-21 వ‌ర‌కు దేశ‌వ్యాప్తంగా 56,305 ఎక‌రాల విస్తీర్ణాన్ని క‌వ‌ర్ చేసేందుకు ఔష‌ధ మొక్క‌ల సాగుకు మ‌ద్ద‌తునిచ్చింది.

మరిన్ని చదవండి .

తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం... త్వరలో రైతులకు డ్రోన్లు..

ప్ర‌స్తుతం, కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ప‌రిధిలోని జాతీయ ఔష‌ధ మొక్క‌ల బోర్డు కేంద్ర రంగ ప‌థ‌క‌మైన ఔష‌ధ మొక్క‌ల ప‌రిర‌క్ష‌ణ‌, అభివృద్ధి, నిల‌క‌డైన నిర్వ‌హ‌ణను అమ‌లు చేస్తోంది. ఇందులో భాగంగా దిగువ‌న పేర్కొన్న కార్య‌క‌లాపాల‌కు తోడ్పాటునందించ‌డం జ‌రుగుతోంది:

  • సంయుక్త అట‌వీ నిర్వ‌హ‌ణ క‌మిటీలు (JFMC )తో/ పంచాయ‌తీలు/ వ‌న పంచాయితీలు/ జీవవైవిధ్య నిర్వ‌హ‌ణ క‌మిటీలు (BMC )/ స్వ‌యం స‌హాయ‌క బృందాలు (SHG )తో అనుసంధానాలు.
  • ఔషధ మొక్కల సాగుకు శిక్ష‌ణ‌/ వ‌ర్క్‌షాప్‌లు/ సెమినార్లు/ స‌ద‌స్సులు, త‌దిత‌ర కార్య‌క‌లాపాలు.
  • ప‌రిశోధ‌న & అభివృద్ధి
  • ఔష‌ధ మొక్క‌ల ఉత్ప‌త్తుల వ్యాపారం, మార్కెటింగ్ కు ప్రోత్సాహం.

గమనిక :ఈ స‌మాచారాన్ని ఆయుష్ మంత్రి- శ్రీ "స‌ర్బానంద్ సోనేవాల్ "నేడు రాజ్య‌స‌భ‌కు ఇచ్చిన లిఖితపూర్వ‌క స‌మాధానంలో వెల్ల‌డించారు.

Source :PIB 

మరిన్ని చదవండి .

వన్యప్రాణి సంరక్షణ మరియు స్థిరమైన జీవవైవిధ్య వినియోగంపై అవగాహన ఒప్పందంపై సంతకాలు చేసిన భారతదేశం-నమీబియా

Share your comments

Subscribe Magazine

More on Agripedia

More