Agripedia

రైతుగా మారిన ఇంజనీరు.. నెలకు లక్షల్లో ఆదాయం పొందుతూ ఎందరికో ఆదర్శం!

KJ Staff
KJ Staff

తెలంగాణ రాష్ట్రానికి చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి మల్లికార్జున్ రెడ్డి అనుకోకుండా వ్యవసాయ రంగంలో అడుగుపెట్టి ఇండియన్ కౌన్సిల్ అఫ్ అగ్రికల్చర్ రీసర్చ్ అవార్డును పొందడమే కాకుండా, అవార్డు పొందిన మొట్టమొదటి రైతుగా గుర్తింపు పొంది ఈనాటి యువతరానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. అసలు వివరాల్లోకి వెళితే తెలంగాణలోని పెద్ద కుర్మపల్లికి చెందిన మల్లికార్జున్ హైదరాబాద్లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్
గా పెద్ద కంపెనీలో పనిచేస్తు లక్షల్లో జీతం, లగ్జరీ లైఫ్ వదిలేసి వ్యవసాయంలో అడుగుపెట్టడానికి కారణం.మల్లికార్జున్ రెడ్డి సమీప బంధువు ఒకరు క్యాన్సర్ కారణంగా చనిపోయారు. ఇది తెలుసుకున్న మల్లికార్జున్ మునుపటితరాలలో క్యాన్సర్ గురించి లోతుగా అధ్యయనం చేయడం ప్రారంభించాడు.వారి పూర్వీకుల్లో ఒక్కరికి కూడా క్యాన్సర్ లేదు కానీ ఇతనికి మాత్రం ఎలా వచ్చిందో తెలుసుకోవడానికి అనేక ప్రయత్నాలు చేశాడు.

వ్యవసాయంలో అధిక దిగుబడులే లక్ష్యంగా విచ్చలవిడిగా పురుగుమందులను వాడడంతో
పురుగు మందు అవశేషాలు మనం నిత్యం ఆహారంగా తీసుకొనే పండ్లు, కూరగాయల్లో ఉండిపోతున్నాయి. ఇలాంటి ప్రమాదకర రసాయనాలు నిండిన పదార్ధాలను తినడమే క్యానర్స్ కు కారణమని మల్లికార్జున్ కనుగొన్నాడు. ఇంతటి తీవ్ర అనారోగ్యానికి కారణమయ్యే ఆహార అలవాట్లు మార్చుకోవడమే కాకుండా తానే రైతుగా మరీ సేంద్రియ వ్యవసాయాన్ని ప్రారంభించాడు. ఇందుకు భార్య సాధ్య కూడా ఒప్పుకోవడంతో పెద్దలు ఇచ్చిన 13 ఎకరాల భూమిలో సేంద్రియ వ్యవసాయాన్ని ప్రారభించాడు.

మొదట మల్లి కార్జున్ తనకున్న భూమిలో కొంత
పరిమాణంలో మాత్రమే సేంద్రియ వ్యవసాయం చేయడం మొదలుపెట్టాడు. అలాగే సేంద్రియ వ్యవసాయంలో తన ప్రయోగాలు చేస్తూ మెల్లగా సాగును విస్తరింప చేసాడు.రోజువారీ ఆహారం లో ఉపయోగపడే ఆకుకూరలు, పండ్లుతో పాటు,వరి, కొర్ర ,సజ్జా,అల్లం, నువ్వులు, వేరు శెనగ, ఎన్నో ఔషధ మొక్కలు తన వ్యవసాయ క్షేత్రంలో పెంచుతున్నాడు. ప్రస్తుతం మల్లికార్జున్ తనకున్న 13 ఎకరాలతో పాటు మరో 20 ఎకరాలు కౌలుకు తీసుకొని సేంద్రియ పద్ధతుల్లో ఆరోగ్యకరమైన పంటలు పండిస్తూ ఏడాదికి 16 లక్షలకు పైగా ఆదాయాన్ని పొందుతున్నాడు.

మల్లికార్జున్ వర్షపు నీటిని నిల్వ చేసి చెరువులో 600 చేపల పెంపకాన్ని చేపట్టి ఆక్వాకల్చర్‌ను కూడా ప్రారంభించాను. ఆవులు,గొర్రెలు, కోడి, మేక పెంచుతూ వాటి వ్యర్థాలను పంటలకు సహజ పోషకాలుగా అందిస్తున్నాడు. జీవామృతం,వేప, పచ్చిరొట్ట వంటి సేంద్రీయ ఎరువులు వాడుతూ పంటలు పండించి భూమి సారాన్ని పెంచుతున్నాడు. మల్లికార్జున్ ప్రయత్నానికి ఇండియన్ కౌన్సిల్ అఫ్ అగ్రికల్చర్ రీసర్చ్ అవార్డును గెలుచుకున్నారు. ఈ ఘనత సాధించిన మొట్టమొదటి రైతుగా మల్లికార్జున్ నిలిచారు.కేవలం అతను సేంద్రియవ్యవసాయం చేసినందుకే అవార్డులు రాలేదు. మల్లికార్జున్ రానున్న తరాల కోసం ఆరోగ్యమైన ఆహార పంటలను అందించడానికి సేంద్రియ పద్ధతుల్లో వ్యవసాయరంగంలో నూతన పద్ధతులు ఆవిష్కరించడం జరిగింది.

Share your comments

Subscribe Magazine