ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రాలు (పిఎంకెఎస్ కె) కింద ఇప్పటికే ఉనికిలో ఉన్న 600 జిల్లా స్థాయి రిటైల్ షాపులను పునర్నిర్మించి,వ్యవసాయ ఇన్ పుట్లు, సేవల పరంగా మరిన్ని సౌకర్యాలను కల్పిస్తున్నారు. ఈ కేంద్రాలను పిఎం కిసాన్ సమ్మేళన్ సందర్భంగా ప్రధానమంత్రి ప్రారంభించారు.
ఈ కేంద్రాలన్నీ కూడా పరిశుభ్రమైన ఆవరణ, రైతులకు మరిన్ని సౌకర్యాలతో స్వచ్ఛతా ప్రచారం 2 చొరవలకు అద్భుతమైన ఉదాహరణలుగా నిలిచాయి. దేశవ్యాప్తంగా 600 ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రాలు (పిఎంకెఎస్ కె)ల ప్రారంభం అన్నది రసాయనిక ఎరువుల విభాగం చేపట్టిన ప్రత్యేక ప్రచారం 2.0 చొరవల్లో భాగంగా అవలంబించిన అత్యుత్తమ పద్ధతులలో ఒకటి.
ఎరువుల శాఖ ప్రత్యేక ప్రచారం 2.0 సందర్భంగా చేపట్టిన ఇతర చొరవలకు ఇది అదనం. ఇందులో తమ కేంద్ర కార్యాలయంలో, ఎరువుల శాఖ పాలనా నియంత్రణలో ఉన్న పిఎస్ యులలో గుర్తించిన 13 ప్రాంతాలలో రికార్డ్ రిటెన్షన్ షెడ్యూల్ ప్రకారం పాత ఫైళ్ళను, ఇ- ఫైళ్ళను తొలగించడం, రికార్డుల డిజిటీకరణ, కాగితం పనిని తగ్గించడం, ఇ- వృధాలను, చెత్త పదార్ధాలను విసర్జించడం తద్వారా సామర్ధ్యాన్ని, స్పేస్ మెరుగుపరచడం. తాజా పరిచిన సమాచారాన్ని కూడా ఎస్ సిడిపిఎం పోర్టల్ పై క్రమం తప్పకుండా అప్ లోడ్ చేస్తారు.
Share your comments